HomeసినిమాBollywood: War 2 shooting is ready for NTR and Hrithik..! Bollywood...

Bollywood: War 2 shooting is ready for NTR and Hrithik..! Bollywood : War​ 2 షూటింగ్​కు NTR,Hrithik​ రెడీ..!

2019లో వచ్చిన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వార్2 గురించి ​ఆడియెన్స్​ ఓ రేంజ్​లో ఎదురుచూస్తున్నారు. సెకండ్ పార్ట్​లో హృతిక్​ రోషన్​తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో హైప్ నెక్స్ట్ లెవెల్​కు చేరుకుంది. అందుకే ఈ సినిమాపై బాలీవుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ భారీ క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. మేకర్స్ షూటింగ్ కోసం అంతా రెడీ చేయగా.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తొందరలోనే సెట్స్​లో జాయిన్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ షూటింగ్ అంతా దాదాపు ఫారిన్ కంట్రీస్​లోనే జరుగనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఆల్రెడీ లొకేషన్స్​ను లాక్ చేయగా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఇద్దరు హీరోస్ కూడా ఎక్కువ విదేశాల్లోనే ఉంటారని అంటున్నారు. ఇక ఇండియాలో అయితే ముంబయిలో కొన్ని పోర్షన్స్ వరకు షూట్ ఉంటుందని టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img