Bomb:హైదరాబాద్‌లో బాంబు కలకలం సృష్టించింది. నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో ఉన్నట్లు సోమవారం డయల్ 100 నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఐటీ టవర్స్‌కు చేరుకున్నారు. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో అణువణువునా గాలింపు చేపట్టారు. చివరకు ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి పనిగా పోలీసులు భావిస్తున్నారు. అలాగే బషీర్‌బాగ్‌లోని ఆయకర్ భవన్‌లోనూ పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి.