దిల్లీలోని హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీస్ కంట్రోల్ రూంకు బాంబు బెదిరింపు అంటూ మెయిల్స్ వచ్చాయి. నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్, రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే మార్గాల్లో భద్రత కట్టుదిట్టం. నార్త్‌బ్లాక్ నుంచి ఉద్యోగులను బయటికి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇటీవలే దిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. వందలమంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోలీసులను అభినందించారు.
అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పీఓకేను స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా ప్రకటన చేశారు .
కొద్ది రోజుల క్రితం దిల్లీలోని పాఠశాలలు, హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు, అధికారులు ముమ్మర తనిఖీలు చేసినా బాంబు జాడ కనిపించలేదు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సారి కేంద్రహోం శాఖ కార్యాలయంలోనే బాంబు పెట్టామని ఆగంతకులు మెయిల్స్ పంపించడం కలకలం రేపుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆగంతకుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేశారు.