Homeహైదరాబాద్latest Newsతాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..ఇమెయిల్ ద్వారా సందేశం..!

తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..ఇమెయిల్ ద్వారా సందేశం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని తాజ్ మహల్ పర్యాటక శాఖకు మంగళవారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. పర్యాటక శాఖకు ఈ ఇమెయిల్ వచ్చింది. దాని ఆధారంగా తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. బాంబు బెదిరింపుతో తాజ్ మహల్ వద్ద జనాలని పోలీసులు అప్రమత్తంచేసారు. అలాగే చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పోలీసులు చేపట్టారు. మరోవైపు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ చేసారు. మెయిల్ పంపిన వారిని ట్రేస్ చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు అని ఏసీపీ సయీద్ అరీబ్ అహ్మద్ తెలిపారు.ఈ మెయిల్ ను పంపిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img