బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బాంబ్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.