HomeతెలంగాణBonalu:బోనాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు - తలసాని శ్రీనివాస్ యాదవ్

Bonalu:బోనాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు – తలసాని శ్రీనివాస్ యాదవ్

Bonalu: బోనాల ఉత్సవాల సందర్బంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సభితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, MLC లు, MLA లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, 16 వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని తెలిపారు.

ప్రజాప్రతినిధులు ఏర్పాట్ల లో భాగస్వాములై పర్యవేక్షణ జరపాలని, ఇంకా ఏమైనా ఏర్పాట్లు అవసరమైతే సంబధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పారు. భక్తులు క్యూ లైన్ లలో తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అవసరమైన ప్రాంతాలలో CC కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బోనాలు తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక లైన్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్ లు, జనరేటర్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆలయాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే లా చూడటం కోసం అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాలలో ఉన్న వారు బోనాల ఉత్సవాలను తిలకించే విధంగా TV లలో ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 దేవాలయాల వద్ద భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 8 ప్రాంతాలలో త్రీ డీ మ్యాపింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

Recent

- Advertisment -spot_img