ఇదే నిజం, ధర్మపురి రూరల్ : ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో మున్నురుకాపు సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలు పోచమ్మ తల్లి లక్ష్మి దేవతలకు బోనాలను ఘనంగా నిర్వహించారు. గురువారం బోనలను ఎత్తుకొని మున్నూరు కాపు మహిళలు సంఘం కుటుంబ సభ్యులు ఆలయానికి బయల్దేరారు. రైతులందరు దేవాలయాలకు చేరుకున్నారు .అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.
ఈ సంధర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు న్యాయవాది జాజాల రమేష్ మాట్లాడుతు ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని . గ్రామ దేవతలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని రైతులకు ప్రగాఢ విశ్వాసం అన్నారు.వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచి జాజాల శంకర్ .సంఘం ఉపాధ్యక్షుడు పాదం చేంద్రయ్య. సభ్యులు జంగిలి తిరుపతి. కరువత్తుల నాగరాజు. జాజాల రవి .చిపిరిశెట్టి శెంకర్ .పాదం శెంకర్ . మినయ్య. రాజన్న. గంగన్న. గనే బక్కన్న. పన్నల ఇందన్న .ఎనుముల పోషన్న. రైతులు పాల్గొన్నారు.