Border-Gavaskar Trophy – 2024 షెడ్యూల్‌ను Cricket Australia వెల్లడించింది . ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వెళ్లనుంది. నవంబర్ 22-26 తేదీల మధ్య Perth వేదికగా తొలి టెస్టు జరగనుండగా.. డిసెంబర్ 6-10 తేదీల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు (Day and Night Match) జరగనుంది. 2020లో Adelaide వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్టులో కోహ్లి సేన 36 పరుగులకే ఆలౌటయ్యింది. భారత జట్టుకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు.