భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. లంక బౌలర్ భిన్నమైన బౌలింగ్ మ్యాచ్ కి హైలైట్‌గా నిలిచాడు. సాధారణంగా ఏ బౌలర్ అయినా కుడిచేతి వాటం లేదా ఎడమచేతి వాటంతో బౌలింగ్ చేస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్ కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేయడానికి వచ్చిన మెండిస్.. సూర్యకుమార్ యాదవ్‌కు లెఫ్టాండ్‌తో బౌలింగ్ చేసిన కమిందు మెండిస్.. రిషబ్ పంత్‌కు మాత్రం రైట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేశాడు. అయితే మెండిస్ ఒకే ఓవర్‌లో రెండు చేతులతోనే బౌలింగ్ చేయడం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఐసీసీ ఆర్టికల్ 21.1.1 రూల్ ప్రకారం.. సదరు బౌలర్ కుడిచేతితో బంతినేస్తాడా? ఎడమ చేతితో బౌలింగ్ చేస్తాడా? అనేది అంపైర్‌కు ముందే చెప్పాల్సిందే. అంపైర్‌కు తెలపకుండా.. బంతిని వేస్తే దానిని ‘నో బాల్’గా ప్రకటిస్తాడు.