వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన కమలం పార్టీ.. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 27 మందితో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా, కో-కన్వీనర్‌గా పీయూష్ గోయల్‌ను నియమించారు.