Homeక్రైంTATA కారు కింద పడి బాలుడి మృతి

TATA కారు కింద పడి బాలుడి మృతి

– కేరళలో విషాదం


ఇదే నిజం, నేషనల్ బ్యూరో: తాత కారు కింద పడి రెండేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ విషాద ఘటన కేరళలోని కాసర్​గోడ్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక కారు లోపలికి వచ్చింది. దానిని గమనించిన ఒక పిల్లాడు పక్కకు జరిగిపోయాడు. అయితే.. అది తమ తాత కారు అని గుర్తుపట్టి రెండేళ్ల చిన్నారి మాత్రం ఎదురుగా వెళ్లాడు. కానీ ఆ విషయాన్ని అతడి తాత గమనించుకోలేకపోయాడు. కారును పార్క్‌ చేసేందుకు పక్కకు తిప్పడంతో.. దాని టైర్‌ కింద చిన్నారి నలిగిపోయాడు. ఈ విషయాన్ని పక్కనున్న మరో పిల్లాడు గుర్తించి కేకలు వేయడంతో.. ఏదో ప్రమాదం జరిగిందని కారులోని వ్యక్తి కిందికి దిగాడు. ఇంతలోనే అక్కడున్న పిల్లాడు కారు కిందకు దూరి, చిన్నారిని బయటకు లాగాడు. దీంతో తన కారు కింద నలిగిపోయిన మనవడిని చూసి, ఆ తాత తల్లడిల్లిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ పసివాడు తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో ఘటన జరిగిన తీరు వెలుగులోకి వచ్చింది.

Recent

- Advertisment -spot_img