ఇదే నిజం, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. పాము కాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన పటాన్‌చెరు నియోజకవర్గం జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో జరిగింది. బానోత్ కిరణ్ (14) అనే బాలుడు మృతి చెందాడు.
మృతుడి తండ్రి కథనం మేరకు.. నిన్న రాత్రి 9.గంటలకు కుటుంబ సభ్యులు భోజనం చేసి వాకిట్లో నిద్రిస్తున్నారు. కుమారుడు కిరణ్ ఒక్కసారిగా అరిచాడు. కుటుంబసభ్యులు లేచి చూసే సరికి పామును గమనించామన్నారు. వెంటనే చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కిరణ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.