స్టార్ హీరోయిన్ సాయిపల్లవిపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. #బాయ్‌కాట్ సాయిపల్లవి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ‘అమరన్’ మూవీ తెరకెక్కగా హీరోయిన్ సాయి పల్లవి ఢిల్లీలోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. గతంలో ఆమె ఇండియన్ ఆర్మీ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ కోసమే వార్ మెమోరియల్ సందర్శించారని కొందరు ఎక్స్ వేదికగా విమర్శిస్తున్నారు.