Homeహైదరాబాద్latest Newsఆసక్తికరమైన టైటిల్ తో "బ్రహ్మానందం" తనయుడు రీ ఎంట్రీ..!

ఆసక్తికరమైన టైటిల్ తో “బ్రహ్మానందం” తనయుడు రీ ఎంట్రీ..!

పుష్కర కాలం తర్వాత బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. మంచి కంటెంట్ కోసం ఇంత గ్యాప్ తీసుకుని ఇన్నేళ్ల తర్వాత ఓ సినిమా ఓకే చేసాడు. ఈ చిత్రానికి ‘బ్రహ్మానందం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో సినీ అభిమానులను కడుపుబ్బా నవ్విస్తోంది. అందులో గౌతమ్ తదుపరి సినిమా గురించి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగిన సంభాషణ నవ్వించేలా ఉంది. ఇందులో గౌతమ్ తదుపరి సినిమా దర్శక, నిర్మాతల వివరాలను వారి ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ వి ఎస్ నిఖిల్ తెరకెక్కించనుండగా, మసూద బ్యానర్ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే శాండిల్య పీసపాటి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ అనౌన్సమెంట్ వీడియోలో తన స్కోర్ మంచి రిఫ్రెషింగ్ గా ఉంది. అన్నట్టు ఈ సినిమాకి ఆసక్తికర టైటిల్ “బ్రహ్మ ఆనందం” అనే పేరు పెట్టడం విశేషం. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 12న సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

Recent

- Advertisment -spot_img