Homeవిద్య & ఉద్యోగంEligibility Test : అంబేద్కర్ వర్షిటీ అర్హత పరీక్షకు 308 ఖైదీలు హాజరు

Eligibility Test : అంబేద్కర్ వర్షిటీ అర్హత పరీక్షకు 308 ఖైదీలు హాజరు

Eligibility Test : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అర్హత పరీక్ష రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ / ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు. ఈ అర్హత పరీక్షకు 8,971 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ అర్హత పరీక్షకు వివిధ జైళ్ల నుంచి 308 ఖైదీలు పరీక్ష రాశారు.

చెర్లపల్లి – 105; వరంగల్- 38; రాజమండ్రి -73; కడప – 59, నెల్లూరు – 33. ఖైరతాబాద్ డిగ్రీ కళాశాల, బేగంపేట లోని మహిళా కళాశాలలోని పరీక్ష కేంద్రాలను విశ్వవిద్యాలయ ఇంఛార్జి అకాడమిక్ డైరెక్టర్ ప్రో.ఇ. సుధారాణి, ఇంచార్జి రిజిస్ట్రార్ డా.జి. లక్ష్మ రెడ్డి సందర్శించారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 2020-21 సంవత్సరంలో (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) ప్రవేశం పొందొచ్చని విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img