భారీ వర్షాలకు బ్రెజిల్ అతలాకుతలం అయ్యింది. ఎన్నడూ చూడని డిజాస్టర్ గా బ్రెజిల్ వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగి పడటంతో 37 మంది మృతి చెందారు. అలాగే సుమారు 74 మంది గల్లంతు అయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండ్లు, బ్రిడ్జ్‌లు కూలిన ప్రదేశాల్లో శిథిలాలను తొలగిస్తున్నారు. విచిత్ర వెదర్ వల్ల పరిస్థితులు అదుపు తప్పినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఎడూర్డో లీట్ తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభావత ప్రాంతాలకు సాయాన్ని అందించనున్నట్లు అధ్యక్షుడు లుజ్ ఇనాసియో లులా డ సిల్వా తెలిపారు.