తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుందని, అప్పటివరకూ భూ సంబంధించిన ఆర్డర్లు జారీ చేయవద్దని జిల్లా కలెక్టర్లను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. కొత్త చట్టం ప్రకారమే భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకూ ఎలాంటి ఆర్డర్లు ఇవ్వొద్దని, ఒకవేళ ఎవరైనా ఇచ్చినా అవి చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.