ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసు మందు ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ముందు భవనం పైకెక్కి, తమ భూమిని వైసీపీ కార్పొరేటర్ కబ్జా చేశారని వారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని.. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వారు వాపోయారు. తమ సమస్య పరిష్కారిస్తారని కొండంత ఆశతో పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చినట్లు వారు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని రక్షించారు.