ప్రముఖ సినీ నటి జాన్వీకపూర్ ఆస్పత్రి పాలయ్యారు. ఆమె తిన్న ఆహారం కల్తీ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.