Homeహైదరాబాద్latest NewsBREAKING: రూటు మార్చిన ఐకాన్ స్టార్.. వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్న అల్లు అర్జున్..!

BREAKING: రూటు మార్చిన ఐకాన్ స్టార్.. వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్న అల్లు అర్జున్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూటు మార్చేశాడు.. మొన్నటి దాకా మామ జనసేన పార్టీకి మద్దతు తెలిపి సడెన్ గా వైసీపీ అభ్యర్థికి తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు. ఇది చూసిన మెగా అభిమానీయులు అవాక్కయ్యారు. దేశ‌మంత‌టా ప్ర‌స్తుతం ఎన్నిక‌ల హీట్ నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్ స‌భ‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జ‌రుగనున్నాయి. ఈ ఎన్నిక‌లలో ఇప్ప‌టికే వైసీపీ, టీడీపీ-జ‌న‌సేన పార్టీలు హోరాహోరీగా పోటిప‌డుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని అల్లు అర్జున్ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ పెట్టిన రెండు రోజుల‌కే తాజాగా వైసీపీ పార్టీ అభ్యర్థికి మ‌ద్ద‌తు తెలిపాడు అల్లు అర్జున్.

అస‌లు విష‌యానికి వ‌స్తే.. వైసీపీ నేత, ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌వి చంద్ర కిషోర్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా నంద్యాల నుంచే వైసీపీ పార్టీ తరపున పోటి చేస్తున్నాడు. అయితే ర‌వి చంద్ర కిషోర్ అల్లు అర్జున్ మంచి స్నేహితుడు. దీంతో శిల్ప రవి కోసం ప్రచారంలో పాల్గోన‌డానికి నంద్యాల వ‌చ్చాడు అల్లు అర్జున్. ఇక నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో అభిమనులు భారీ ర్యాలీతో, గజమాల వేసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మొదట శిల్ప రవి ఇంటి వద్దకు వెళ్లగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img