క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి చేరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 28న వైసీపీలో సీఎం జగన్ సమక్షంలో చేరిన అంబటి రాయుడు 10 రోజుల్లోనే ఆ పార్టీని వీడి ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారారు. అయితే ఈరోజు అంబటి రాయుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. జనసేనలో అంబటి రాయుడు చేరనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా జనసేన ముఖ్యనేతలతో రాయుడు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.