Homeహైదరాబాద్latest NewsBREAKING: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ..!

BREAKING: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ..!

ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి బీబీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కారు దిగి హస్తం గూటికి చేరారు. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలను నిజం చేశారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గాంధీకి కండువా  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు. కాంగ్రెస్ లో చేరిన వారిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్  కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img