కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్రంగా వీరి రాకను వ్యతిరేకిస్తున్నారట. ఢిల్లీలోని హైకమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. లోకల్ సమీకరణాలు కుదరక పోస్ట్ పోన్ అవుతున్నది. సీఎం సలహాదారు వెంరెడ్డి త్వరలో అన్ని అడ్డంకులను క్లియర్ చేసి మామా అల్లుళ్లను కాంగ్రెస్ లోకి తెస్తున్నాడని తెలుస్తోంది.