వైసీపీ వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన సతీమణి, జడ్పీ చైర్‌పర్సన్ అరుణమ్మ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నివాసానికి విజయకుమార్ రెడ్డి, అరుణమ్మ దంపతులు వెళ్లడంతో నెల్లూరూ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.