లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో భాగంగా పోలీసులు ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా పేర్కొన్నారు. వీరిద్దరు పదేళ్లుగా సహజీవనం చేశారని, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు లావణ్య ఇంటి నుంచి పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. అయితే ఈ కేసులో హీరో రాజ్ తరుణ్ ముందస్తుగా బెయిల్ తీసుకున్నట్లు తెలుస్తోంది.