భారీ వర్షాల వేళ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణకు తన వంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని తెలియజేశారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు ఏపీకి పవన్ రూ. కోటి విరాళం ప్రకటించారు.