అందరూ ఊహించినట్లే జరిగింది. ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ పేరును ఆన్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. ఆతిశీ పేరును పార్టీ అధినేత కేజీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. ఈ మేరకు శాసనసభా పక్ష నేతగా ఆతిశీని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కాగా, ప్రస్తుతం ఆతిశీ ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి కేజీవాల్ రాజీనామా చేయనున్నారు. సెప్టెంబరు 26-27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.