మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. తాజాగా ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు బాబు మోహన్ ఓ ఫోటోను విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. గతంలో బాబు మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలోని తాజాగా పరిస్థితుల్లో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.