ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన కేసులో కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే ఇదే లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.