వైసీపీ అధినేత జగన్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఝలక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్‌కు రిజైన్ లేఖను పంపినట్లు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పార్టీలో తనకు అవమానం జరుగుతుందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయనను బుజ్జగించేందుకు మాజీ మంత్రి విడదల రజనీని జగన్ రంగంలోకి దింపినప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు.