బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. విధులు అడ్డగించి బెదిరించారని ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డి సహా 20 మంది అనుచరులపై బుధవారం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో గురువారం ఆయన్ ను అరెస్టు చేశారు.