జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ బంపరాఫర్ ఇచ్చింది. ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్ వచ్చినట్టు సమాచారం.