బ్రెజిల్లోని అలగోవాస్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. యునియో డోస్ పాల్మారెస్లోని సెర్రా డా బారిగాలో ఒక పాఠశాల బస్సు అదుపుతప్పి కొండపై నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. బస్సులో పిల్లలు, పెద్దలు సహా 40 మంది ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.