ఢిల్లీలో నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ మేరకు NEET UG-2024 ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. వారందరికీ జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహించి, జూన్ 30లోపు ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. నీట్ యూజీ-2024 కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అటు కౌన్సెలింగ్పై స్టే విధించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది.