తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. స్పీకర్‌ను ఏకవచనంలో సంబోధించారని, దీంతో స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి ఏం తప్పు మాట్లాడలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార, విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.