తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దలందరినీ కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు వీరందరినీ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఆహ్వానించనున్నారు.