హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జంట జలాశయాలను రక్షించడమే మా బాధ్యత. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన ఎవర్నీ వదలం. అందులో నా బంధువుల నిర్మాణాలు ఉన్నా కూల్చేస్తాం. నిబంధనుల ఉల్లంఘించి కట్టిన ఫాంహౌస్ ను కేటీఆర్ ఎలా లీజుకు తీసుకుంటారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం’ అని అన్నారు. అలాగే ‘హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఫామ్ హౌస్లు కట్టుకున్న కొందరు సెలబ్రిటీలు మురికినీటిని ఉస్మాన్, హిమాయత్నగర్లోకి వదులుతున్నారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు.