మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలతో సహా ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. దీంతో ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు పరిస్థితి కనిపిస్తోంది. పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో పోలీసులు పరుగులు తీస్తున్నారు. వీరి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసినట్లు సమాచారం.