లోక్‌సభలో ప్రమాణస్వీకారాల కార్యక్రమం సందర్భంగా కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అని అన్నారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను రికార్డులో లేకుండా చూస్తామని ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ హామీ ఇవ్వడంతో అధికార పార్టీ ఎంపీలు శాంతించారు.