కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న చోట మాత్రమే నిధులిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట నిధులివ్వడం లేదని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా అవమానానికి గురిచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏమైందో చూశారు.. అలాంటి గతి కాంగ్రెస్ పట్టకుండా చూసుకోవాలని హితువు పలికారు.