సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ మేరకు ఆయనను దిల్లీలోని ఎయిమ్స్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్పించారు. ఏచూరి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, రెస్పిరేటరీ సపోర్ట్ పై ఉన్నారని సీపీఎం పార్టీ మంగళవారం తెలిపింది. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ జరిగిందని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది.