Homeహైదరాబాద్latest NewsBreaking: వైన్‌షాపుల వద్ద క్యూ కట్టిన మందుబాబులు..!

Breaking: వైన్‌షాపుల వద్ద క్యూ కట్టిన మందుబాబులు..!

ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు మందు బంద్‌ కానుందని ఈసీ పేర్కొంది. ఈసీ ఆదేశాలు తో ముందస్తుగా అప్రమత్తమైన మందుబాబులు.. వైన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని సూచించారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి 13 సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈసీ ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న మద్యం షాపులు కూడా మూతపడనున్నాయి.

Recent

- Advertisment -spot_img