బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పద్మారావు, మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వివేకానంద, సబితాఇంద్రారెడ్డి మినహా మిగిలిన వారితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.