ప్రముఖ నటి CID శకుంతల (84) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె 1960లలో బ్యాక్లౌండ్ డ్యాన్సర్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970లో వచ్చిన CID సినిమా తర్వాత ఆమెను CID శకుంతలగా పిలిచేవారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి సినిమాల్లో నటించారు.