అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. విమానాశ్రయంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతుండగా..పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం దానికి అడ్డుగా వచ్చింది. దీంతో రెండూ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానం, హెలికాఫ్టర్ రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. హెలికాఫ్టర్ లో పైలెట్లు ఇద్దరు ఉండగా.. విమానంలో 60 దాకా ప్రయాణికులు, స్టాఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.