మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ (82) వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. మారక్ కాంగ్రెస్ సీనియర్ నేత. మేఘాలయలో ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న తొలి ముఖ్యమంత్రిగా 1993లో ఆయన రికార్డులకెక్కారు. 1998లో కేవలం 12 రోజులపాటు సీఎంగా పనిచేశారు. 2003లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు.