TSPSC ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. కొత్త సభ్యుల పేర్లను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. కొత్త చైర్మన్ పదవికి చాలా మంది అప్లై చేసుకున్నారు. అయితే.. విశ్వసనీయత, సమర్థత, భద్రత అంశాలను పరిగణలోకి తీసుకుని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం సిఫార్సు చేసింది.