భుజానికి గాయంతో భాదపడుతున్న మాజీ మంత్రి హరీష్ రావుకు ఆస్పత్రికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు. ఉదయమే హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన హాస్పిటల్ కు వెళ్తానంటే అనుమతి ఇవ్వలేదు. అనంతరం అనుమతివ్వడంతో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనతో పాటు పోలీసులు కూడా వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.