బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి హరీశ్‌రావు రాగా.. పోలీసులు గేటు వద్దే ఆయనను ఆపివేశారు. లోపలికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.