హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి పడుతున్న వానతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా, గ్రేటర్ పరిధిలోని పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం బీభత్సంగానే ఉంది. పరిస్థితిని బట్టి స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని డీఈవో.. ఎంఈవోలకు పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.